సౌరవిద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకోండి

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:57 AM

వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే... 25ఏళ్లపాటు యూనిట్‌కు రూ.3.13 చెల్లించి, కరెంట్‌ను ప్రభుత్వం కొంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు.

25 ఏళ్లపాటు యూనిట్‌కు రూ.3.13 చెల్లిస్తాం

రైతులు, సహకారసంఘాలు దరఖాస్తు చేసుకోండి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే... 25ఏళ్లపాటు యూనిట్‌కు రూ.3.13 చెల్లించి, కరెంట్‌ను ప్రభుత్వం కొంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్‌ ఉర్జా సురక్షా ఎవమ్‌ ఉత్థాన్‌ మహాభియాన్‌ కింద 0.5-2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. వ్యవసాయ భూముల్లో లేదా బంజరు భూముల్లో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చని, రైతులు, రైతు సహాయక సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు ప్లాంట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఈ మేరకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Updated at - Dec 25 , 2024 | 04:57 AM