Share News

Manda krishna: ఎస్సీ వర్గీకరణను అడ్డుకొంటున్నది కాంగ్రెసే

ABN , Publish Date - Nov 04 , 2024 | 04:17 AM

‘‘ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్నది.. వర్గీకరణను అడ్డుకుంటున్న మాలలను ప్రోత్సహిస్తున్నది కాంగ్రెస్‌ పార్టీనే’’ అని ఎమ్మాఆర్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

Manda krishna: ఎస్సీ వర్గీకరణను అడ్డుకొంటున్నది కాంగ్రెసే

  • రేవంత్‌పై మాల ప్రజా ప్రతినిధుల ఒత్తిడి: మందకృష్ణ

కామారెడ్డి టౌన్‌, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘‘ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్నది.. వర్గీకరణను అడ్డుకుంటున్న మాలలను ప్రోత్సహిస్తున్నది కాంగ్రెస్‌ పార్టీనే’’ అని ఎమ్మాఆర్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్రంలో అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని ప్రశ్నించారు. కాంగ్రె్‌సలోని మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఒత్తిడికి సీఎం రేవంత్‌ తలొగ్గి వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారని విమర్శించారు.


ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌ పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ‘మాదిగల ధర్మయుద్ధ మహాసభ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన మందకృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై మంత్రులతో కమిటీ వేసిన సీఎం రేవంత్‌.. మళ్లీ కమిషన్‌ ఎందుకు వేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2023 ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో చెప్పిందని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్‌ అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు.

Updated Date - Nov 04 , 2024 | 04:17 AM