Medak: తొగిట హత్య కేసును చేధించిన పోలీసులు.. భర్తే సుపారీ ఇచ్చి దారుణానికి ఒడిగట్టి
ABN , Publish Date - Feb 21 , 2024 | 07:57 PM
హావేలి ఘనపూర్ మండలం తొగిటలో ఈ నెల 11న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. రెండో భార్యతో జీవించడానికి అడ్డుగా వస్తుందన్న కారణంతో మొదటి భార్యను అడ్డు తొలగించుకోవడానికి భర్తే ఈ హత్య చేయించినట్లు విచారణలో వెల్లడైంది.
మెదక్: హావేలి ఘనపూర్ మండలం తొగిటలో ఈ నెల 11న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. రెండో భార్యతో జీవించడానికి అడ్డుగా వస్తుందన్న కారణంతో మొదటి భార్యను అడ్డు తొలగించుకోవడానికి భర్తే ఈ హత్య చేయించినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆశయ్య కొన్నేళ్ల క్రితం సంగమణి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.
అనంతరం మంజుల అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు విషయం తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఎలాగైనా సంగమణిని చంపేయాలని భావించిన కిరాతకుడు తొగిటకు చెందిన 22 ఏళ్ల యువకుడితో రూ.20 వేలకు సుపారీ కుదుర్చుకున్నాడు. ఫిబ్రవరి 11న మంజులతో ఊరికి వెళ్లిన ఆశయ్య అదే రోజు సంగమణిని హత్య చేయించాడు. కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. నిజం బయటకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.