Home » Medak
వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోయి.. .జీవితంపై విరక్తితో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామాయిపల్లిలో రైతు బత్తుల రాజు (40) అప్పులు చేసి బోర్లు వేయగా ఫలితం దక్కలేదు.
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మెదక్ చర్చ్ వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా చర్చి స్థాపకుడు పాస్నెట్కు కృతజ్ఞత సభ నిర్వహించారు.
సాగు చేసిన పంటలు చేతికిరాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక ముగ్గురురైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఖండాంతర ఖ్యాతిగాంచిన మెదక్ చర్చి నిర్మాణమై సరిగ్గా వందేళ్లు గడుస్తున్నాయి. ఈ సందర్భంగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలకు ఈ చర్చి ముస్తాబైంది.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ చర్చి ప్రారంభమై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నుంచి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో మెదక్ చర్చిని గవర్నర్ సందర్శించారు.
సంగారెడ్డి జిల్లా: లగచర్ల కేసులో అరస్టయి నెల రోజుల పాటు జైళ్లలో ఉన్న 16 మంది రైతులు శుక్రవారం ఉదయం సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. రైతులు జైలు నుంచి బయటకు రాగానే గిరిజన సంఘాలు వారికి ఘనస్వాగతం పలికాయి.
సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం లగచర్ల రైతులు విడుదల కానున్నారు. కాగా నాంపల్లి స్పెషల్ కోర్టు బుధవారం రైతులకు బెయిలు మంజూరు చేసింది. గురువారం జైలు అధికారులకు ఆలస్యంగా బెయిలు పత్రాలు అందాయి. దీంతో నిన్న రైతులు విడుదల కాలేదు. ఈ రోజు విడుదలవుతారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ రైస్మిల్పై గురువారం రాత్రి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందం మెరుపు దాడులు చేపట్టింది. దీనిలో భారీగా పీడీఎస్ (రేషన్ బియ్యం) నిల్వలు గుర్తించారు.
గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వేకు పైలట్ ప్రాజెక్ట్ జిల్లాలుగా మెదక్, నిజామాబాద్, మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం ఎంపికయ్యాయి. సర్వే ఆధారంగా లబ్ధిదారుల వివరాలను ‘ఇందిరమ్మ’ యాప్లో నమోదు చేయనున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం తెలిపారు.