మేళ్లచెర్వు శివాలయ హుండీ ఆదాయం రూ.5.33 లక్షలు
ABN , Publish Date - Jan 20 , 2024 | 12:13 AM
మండల కేంద్రంలోని స్వయంభు శంభులింగేశ్వరస్వామి దేవాలయానికి నాలుగు నెలలకు రూ.5,33,246 ఆదాయం హుండీల ద్వారా కానుకల రూపంలో వచ్చిందని ఈవో కొండారెడ్డి తెలిపారు.
మేళ్లచెర్వు, జనవరి 19 : మండల కేంద్రంలోని స్వయంభు శంభులింగేశ్వరస్వామి దేవాలయానికి నాలుగు నెలలకు రూ.5,33,246 ఆదాయం హుండీల ద్వారా కానుకల రూపంలో వచ్చిందని ఈవో కొండారెడ్డి తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ రెవెన్యూ ఇనస్పెక్టర్ వీ రమేష్ ఆధ్వర్యంలో గ్రామపెద్దల సమక్షంలో ఆలయంలోని హుండీల్లోని కానుకలను లెక్కించామని తెలిపారు. వివిధ సేవా టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రోజుల వారీగా బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. కార్యక్రమంలో కాకునూరి భాస్కర్‌రెడ్డి, పోల్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, కేశవరావు, సుబ్రమణ్యం, గ్రామీణ బ్యాంకు సిబ్బంది, సిబ్బంది కొండారెడ్డి, నర్సింహారెడ్డి, అర్చకులు విష్ణువర్థనశర్మ, ధనుంజయిశర్మ పాల్గొన్నారు.