Share News

అమాత్యా.. ఆలకించరూ!

ABN , Publish Date - Dec 14 , 2024 | 12:14 AM

సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ ఆస్పత్రులకు మోక్షం కలిగేనా? జిల్లాలో సొంత భవనాలు లేకుండా నిట్టూరుస్తున్న సబ్‌ సెంటర్ల పనులు వేగం పెరిగేనా... ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత తీరేనా... పీహెచ్‌సీ లకు సొంత భవనాలు మంజూరు అయ్యే నా.. అనే ఆశతో జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.

అమాత్యా.. ఆలకించరూ!
రామప్ప కాలనీ క్వార్టర్స్‌ పరిసరాల్లో మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌ నిర్మాణం కోసం చదును చేసిన స్థలం

సమస్యల వలయంలో ప్రభుత్వాస్పత్రులు

సబ్‌సెంటర్లకు సొంత భవనాలు కరువు

కాళేశ్వరం, గోరికొత్తపల్లి పీహెచ్‌సీలకు భవనాల మంజూరుపై ప్రకటన చేసేనా?

జనాభా ప్రాతిపదికన కొత్త సబ్‌సెంటర్లకు ఒకే చెప్పేనా

తాత్కాలిక భవనాల్లోనే మెడికల్‌ కాలేజీ, హాస్టల్‌ నిర్వహణ

జిల్లా ఆస్పత్రిలో మరిన్ని సేవలకు మోక్షం కలిగేనా!

నేడు భూపాలపల్లి జిల్లాలో వైద్యశాఖ మంత్రి పర్యటన

భూపాలపల్లి కలెక్టరేట్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యో తి): సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ ఆస్పత్రులకు మోక్షం కలిగేనా? జిల్లాలో సొంత భవనాలు లేకుండా నిట్టూరుస్తున్న సబ్‌ సెంటర్ల పనులు వేగం పెరిగేనా... ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత తీరేనా... పీహెచ్‌సీ లకు సొంత భవనాలు మంజూరు అయ్యే నా.. అనే ఆశతో జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. శనివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదార రాజనర్సింహా వస్తుండటంతో సమస్యలకు మోక్షం కలిగేనా.. అని జిల్లా ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి మంత్రి రాజనర్సింహా సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారో లేక ఉసూరు మనిపిస్తారో చూడాలి.

సమస్యల వలయంలో ప్రభుత్వాస్పత్రులు

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు సమస్యల వలయంలో కొట్టుమి ట్టాడుతున్నాయి. శాశ్వత భవనాలు, సరిపడా సిబ్బంది లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. జిల్లాలోని 90 సబ్‌ సెంటర్లలో 21 సబ్‌ సెంటర్లకు మాత్రమే శాశ్వత భవనాలున్నాయి. మిగిలిన 61 సబ్‌ సెంటర్ల భవనాలకు ప్రభుత్వం రూ.3కోట్లకు పైగా కేటాయించింది. ప్రభుత్వం నిధులు కేటాయించినా భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో సెంటర్లలో అరకొరగానే సేవలు అందుతున్నాయి. మంత్రి దామో దార రాజనర్సింహా సబ్‌ సెంటర్ల పనులను వేగవం తం చేయాలని అధికారులను ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు. కాళేశ్వరం, గోరికొత్తపల్లి కేంద్రాలకు పీహెచ్‌సీ సొంత భవనాలు కేటాయించాల్సి ఉంది. రేగొండ మండలం నుంచి గోరికొత్తపల్లి మండలం ఏర్పాటు అయినప్పటికి ఇప్పటి వరకు పీహెచ్‌సీ సేవలు ప్రారంభం కాలేదు. రేగొండ పీహెచ్‌సీ నుంచే సేవలందుతున్నాయి. మండలంకు నూతన పీహెచ్‌సీ కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. కాళేశ్వరంకు నూతన పీహెచ్‌సీని కేటాయించిన గత ప్రభుత్వం నూతన భవనంను మాత్రం నిర్మించలేదు. స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లోనే సేవలు అందిస్తున్నారు. అక్కడ కూడా శాశ్వత భవనం కేటాయించాల్సి ఉంది. దీంతో పాటు జిల్లా కేంద్రంలో గతంలో సేవలు అందించిన పీహెచ్‌సీ జీజీహెచ్‌కు అప్‌గ్రేడ్‌ కావడం తో భూపాలపల్లికి పీహెచ్‌సీ సేవలు అంతంతమా త్రంగా ఉన్నాయి. భూపాలపల్లి మండల గ్రామాలకు వైద్యసేవలు విస్తృతం చేసేందుకు పీహెచ్‌సీ నిర్మాణం చేయాల్సి ఉంది. దీంతో పాటు కాటారం, మొగుళ్లపల్లి, గణపురం, మహదేవపూర్‌ మండలాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా వైద్యసేవలు అందించేందు కు నూతన సబ్‌ సెంటర్ల ఏర్పాటుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలకు మంత్రి మంజూరు చేయాల్సి ఉంది.

సిబ్బంది కొరత తీరేనా..

జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆస్పత్రిలో ఉన్న అరకొర సిబ్బందితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో 14 మంది ఎంబీబీఎస్‌ వైద్యుల పోస్టుల ఖాళీగా ఉండటం పరిస్థితికి అద్దం పడుతున్నా జిల్లా ఆస్పత్రిలో పలు శంకుస్థాపనలు చేయనున్న మంత్రి వైద్యుల భర్తీపై ప్రకటన చేయాలని ప్రజలు కోరుతు న్నారు. జిల్లా వైద్యశాఖలో కూడా ఖాళీలు ఉన్నాయి. 12 మంది ఎంఎల్‌హెచ్‌సీలు, 50 మంది మొదటి ఏఎన్‌ఎంలు ఖాళీలు ఉండటంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. జిల్లా పర్యటనలో మంత్రి ఖాళీల భర్తీకి ప్రకటన చేయాలని కోరుతున్నారు.

అన్నీ తాత్కాలిక భవనాలే..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో 2023 సెప్టెంబరు 15న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని ప్రారంభించింది. కాలేజీ ఏర్పాటుకు శాశ్వత భవనం అందుబాటులో లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రూ.33 కోట్లతో రామప్ప కాలనీ క్వార్టర్స్‌ సమీపంలో నిర్మిస్తు న్న 250 పడకల ఆస్పత్రి భవనంలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించింది. తరగతుల నిర్వహణకు ఆస్పత్రిలో నిర్మాణంలో పలు మార్పులు చేశారు. విద్యార్థులకు వసతి కోసం పక్కనే ఉన్న రామప్ప కాలనీ క్వార్టర్స్‌లో యువతి, యువకులకు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు వసతి ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా 28 క్వార్టర్స్‌ను వినియోగించారు. మొదటి సంవత్సరం 100 మెడికోలతో పాటు ఈ సంవత్సరం కాలేజీలో చేరిన మరో 100 మంది మెడికోలకు రామప్ప క్వార్టర్స్‌లోనే వసతి ఏర్పాటు చేశారు. విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.130 కోట్లతో మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌ పనులను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదార రాజనర్సింహా శంకుస్థాపన చేయనున్నారు.

కలెక్టరేట్‌ తలుపు తడుతున్న విద్యార్థులు

మెడికల్‌ కాలేజీలో సమస్యలు తిష్టవేయడంతో సమస్యలను ఏకరువు పెట్టేందుకు విద్యార్థులు కలెక్టర్‌ కార్యాలయం తలుపు తడుతూనే ఉన్నారు. ఇటీవల గర్స్ల్‌ హాస్టల్‌లో తాగుబోతులు వీరంగం చేయడంతో భయబాంత్రులకు గురైన విద్యార్థులు కలెక్టర్‌ రాహుల్‌ శర్మకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే కాలేజీ వ్యవహారాలు, విద్యార్థుల బాగోగులు చూడాల్సి న ప్రిన్సిపాల్‌ తనకేమి పట్టనట్లు వ్యహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండవ సంవత్సరం విద్యార్థులకు హాస్టల్‌ ఏర్పాటులో చొరవ తీసుకోవాల్సి న ప్రిన్సిపాల్‌ గాలికి వదిలేయడంతో చేసేదేమిలేక విద్యార్థులు రోడ్డెక్కడంతో రంగంలోకి దిగిన కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాస్టల్‌ ఏర్పాటు చేశారు. ప్రతి విషయంతో ప్రిన్సిపా ల్‌ ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో విద్యార్థులు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ చెంతకు పరుగులు తీస్తున్నారు. ప్రిన్సిపాల్‌ విషయంలో ప్రభుత్వ చర్యలకు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Dec 14 , 2024 | 12:14 AM