ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే పూజలు
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:57 PM
శ్రీశైలం ఉత్తర ముఖద్వార మైన శ్రీ ఉమామహేశ్వరక్షేత్రంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఈశ్వరున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
- పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ
అచ్చంపేటటౌన్‌డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం ఉత్తర ముఖద్వార మైన శ్రీ ఉమామహేశ్వరక్షేత్రంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఈశ్వరున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగ పాపనా షిని గుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచ రించి ఈశ్వరునికి క్షీరాభిషేకం, పంచామృతాభి షేకం, రుధ్రాభిషేకం, అమ్మవారికి కుంకుమా ర్చన గణపతి అయ్యప్పస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు రామూర్తి, వీరయ్య, రాజశేఖర్, ఆనంద్‌శర్మ, చంద్రశేఖర్ లు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయం ఆవరణలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి శాలువాతో సత్కరిం చారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో బోగమహేశ్వరంలో తాగునీటి పైపులైన్ల పను లకు భూమి పూజ చేశారు. అనంతరం పంచ లింగాల ఆలయ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని హంగులతో ఆలయం అభివృద్ధి చెందుతుంద న్నారు. పర్యాటక ప్రాంతాలను గుర్తించి పర్యాటకం కోసం అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లోక్యానాయక్, లచ్చునాయక్, గోపాల్‌రెడ్డి, రామనాథం, సంతోష్, అంజి, డైరెక్టర్లు, పవన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.