ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి మాతృవియోగం
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:15 AM
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మాతృ వియోగం జరిగింది.
ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి మాతృవియోగం
నల్లగొండ క్రైం, మాడ్గులపల్లి, డిసెంబ రు 26(ఆంధ్రజ్యోతి): వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి మాతృ వియోగం జరిగింది. ఎమ్మెల్సీ నర్సిరె డ్డి మాతృమూర్తి అలుగుబెల్లి భాగ్యమ్మ (82) అ నారోగ్యంతో గురువారం తెల్లవారుజామున మృ తి చెందింది. ఆమె అంత్యక్రియలు తన స్వగ్రామమైన మాడ్గులపల్లి మండలంలోని చర్లగూడెంలో గురువారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. విషయం తెలుసుకున్న ప్రజా సం ఘాలు, సీపీఎం నాయకులు, ఉపాధ్యాయ సం ఘాల నాయకులు గ్రామానికి చేరుకొని భాగ్య మ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ భాగ్యమ్మ మృతి కుటుంబానికే కాకుండా పార్టీకి తీరని లోటన్నారు. నలుగురు కుమారులను ఉన్నత స్థానాలకు తీసుకొచ్చిందన్నారు. నివాళులర్పించిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ఉపాధ్యక్షుడు సీహెచ.రాములు, కోశాధికారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రాజశేఖర్‌రెడ్డి, నాగమణి, వీఓటీటీ సంపాదకులు మాణిక్‌రెడ్డి, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, రెమడాల పరశురాములు, పాదూరు శశిధర్‌రెడ్డి, వినోద్‌నాయక్, రొండి శ్రీనివాస్, పుల్లెంల శ్రీకర్, పతాని శ్రీను, కుంచం మమత, టీఎ్‌సయూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.