దుర్గాదేవిగా రేణుకాఎల్లమ్మ తల్లి
ABN , Publish Date - May 15 , 2024 | 11:55 PM
మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు వైశాఖమాసం బుద్ధాష్టమిలో భాగంగా బుధవారం దుర్గాదేవిగా భక్తులకు ద ర్శనమిచ్చారు.
దుర్గాదేవిగా రేణుకాఎల్లమ్మ తల్లి
కనగల్, మే 15: మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు వైశాఖమాసం బుద్ధాష్టమిలో భాగంగా బుధవారం దుర్గాదేవిగా భక్తులకు ద ర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భ క్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కుంకుమ అభిషేక పూజ లు జరిపించి చీర సారె, ఒడి బియ్యం బోననైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణం గా ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు.