Share News

పైసలిస్తేనే ఫైలు కదులుద్ది

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:39 AM

రెవెన్యూ విభాగంలో ప్రధానంగా పట్టణంలోని వివిధ గృహాల కు సంబంధించిన ఆస్తి పన్ను వసూళ్లు, ఇంటి బదాలాయింపు (మ్యూటేషన), కొత్త ఇళ్లకు అసీ్‌సమెంట్‌ చేసి నెంబర్లు ఇవ్వడం వంటి విధులు ఉంటాయి.

 పైసలిస్తేనే ఫైలు కదులుద్ది

పైసలిస్తేనే ఫైలు కదులుద్ది

ఇవ్వకపోతే నెలల తరబడి తిరగాల్సిందే

రాజకీయ అండతో వసూళ్లు చేస్తున్న ఓ అధికారి

ఇది నల్లగొండ మునిసిపాలిటీలోని రెవెన్యూ విభాగంలో అవినీతి కహానీ

- రామగిరి

నల్లగొండ మునిసిపాలిటీ అవినీతి అక్రమాలకు పేరుగాంచిన తరుణంలో గత సంవత్సరం వరకు అధికారులు, సిబ్బంది లంచం అడగాలంటేనే వెన్నులో వణుకుపుట్టేది. ప్రస్తుతం మళ్లీ పాతరోజులే గుర్తోచ్చేలా అధకారులు, సిబ్బంది ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకొలేని అధికారులు ఉండటం వల్లే కిందిస్థాయి సిబ్బంది యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. మునిసిపల్‌ కార్యాలయంలో ప్రధానంగా టౌన ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, రెవెన్యూ, శానిటేషన వంటి విభాగాలు ఉన్నాయి. గుండెకాయ లాంటి ఈ రెవెన్యూ విభాగంలో మాత్రం అవినీతి అక్రమాలకు అడ్డగా మారిపోయింది.

రెవెన్యూ విభాగంలో ప్రధానంగా పట్టణంలోని వివిధ గృహాల కు సంబంధించిన ఆస్తి పన్ను వసూళ్లు, ఇంటి బదాలాయింపు (మ్యూటేషన), కొత్త ఇళ్లకు అసీ్‌సమెంట్‌ చేసి నెంబర్లు ఇవ్వడం వంటి విధులు ఉంటాయి. ఆస్తి పన్ను వసూళ్లు బిల్‌ కలెక్టర్లు చేస్తుండగా, పేరు మార్పిడి, అసి్‌సమెంట్‌ వంటి విధులు ఇరువురి అధికారులు పంచుకున్నట్లు తెలుస్తుంది. అయితే వీటిల్లో ఏ పనికి సంబంధించిన ఫైళ్లు కదలాలన్నా ఫైలును బట్టి రూ.5 నుంచి రూ. 10వేల వరకు ఇవ్వాల్సిందే. కాదు కూడదు అంటే వంద రకాల కారణాలు చూపిస్తూ నెలల కొద్దీ చెప్పులు అరిగేలా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా మ్యూటేషన విభాగానికి చెందిన ఓ అధికారి మాత్రం ఇంటి పేరును మార్చేందుకు బహిరంగంగానే వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ అధికారికి కౌన్సలర్ల అండ ఉందని తనకేమీ కాదని చెప్పుకుంటూ యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఓ వ్యక్తి ఇంటి పేరును మార్చేందుకు దరఖాస్తు చేసుకోగా మాకూ ఖర్చులు ఉంటాయి, రూ.5వేలు ఇవ్వాల్సిందేనని దరఖాస్తుదారునితో తెగేసి చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి ఇంటి బదాలాయింపును 15 రోజుల్లోగా మార్చాలి. దరఖాస్తులో ఏమైనా లోపాలు ఉంటే సదరు దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వాలి. కాని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సదరు దరఖాస్తుదారుని నెల రోజుల పాటు తిప్పించుకున్నట్లు తెలిసింది. దీనిని బట్టి చూస్తే లంచం ఇవ్వకపోవడం వల్లే నెల రోజుల పాటు తిప్పించుకున్నట్లు స్పష్టమవుతుంది. ఇక ఈ లంచం విషయం ఆ నోట ఈ నోట పొక్కి కమిషనర్‌ దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో కమిషనర్‌ ముందే సదరు దరఖాస్తుదారుడు ఈ అధికారిని మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ గొడవతో నివ్వెరబోయిన కమిషనర్‌ సదరు అధికారిని మందలించినట్లు తెలిసింది.

ఇదీలా ఉండగా ఇదే విభాగంలో ఓ అఽధికారి తాను నియమించుకున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ద్వారా నూతన గృహాలకు సంబంధించిన అసీ్‌సమెంట్‌ చేయిస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఆనలైన అకౌంట్‌ ద్వారా ప్రజల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అధికారి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అధికారి ఫోనపే, గూగల్‌పే లావాదేవాలపై విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.

అవినీతిపై విచారణ చేయిస్తా

కార్యాలయంలో ఇప్పటి వరకు అవినీతికి తావు లేదు. రెవెన్యూ విభాగంలో లంచాలు వసూళ్లు చేస్తున్నట్లు నా దృష్టికి అయితే రాలేదు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే విచారణ చేయిస్తా. విచారణలో అవినీతి జరిగినట్లుగా రుజువైతే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాఖాపరమైన చర్యలు ఉంటాయి.

- సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌, మునిసిపల్‌ కమిషనర్‌

Updated Date - Nov 21 , 2024 | 12:39 AM