Share News

ఢిల్లీలో కేటీఆర్‌ కొత్త డ్రామాలు: ఎంపీ మల్లు రవి

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:19 AM

లగచర్ల గొడవలకు కారణం తానేనని తేలడంతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఢిల్లీలో కొత్త డ్రామాలు

ఢిల్లీలో కేటీఆర్‌ కొత్త డ్రామాలు: ఎంపీ మల్లు రవి

హైదరాబాద్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): లగచర్ల గొడవలకు కారణం తానేనని తేలడంతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఢిల్లీలో కొత్త డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ఒక ప్రకటనలో విమర్శించారు. కేటీఆర్‌.. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు దళిత, గిరిజన ప్రజల కోసం ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ ముంపు బాధితులు పరిహారం అడిగితే ఎలా కొట్టించిందీ, నేరెళ్లలో దళితులను ఎలా హింసించిందీ ప్రజలకు తెలుసునన్నారు. ఢిల్లీలో కేటీఆర్‌ నాటకాలను వారు నమ్మబోరన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 04:19 AM