Share News

ర్యాగింగ్‌ బాధ్యులపై చర్యలు: నల్లగొండ డీఎస్పీ

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:18 AM

నల్లగొండ వైద్య కళాశాల వసతిగృహంలో ర్యాగింగ్‌ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో వైద్య

ర్యాగింగ్‌ బాధ్యులపై చర్యలు: నల్లగొండ డీఎస్పీ

నల్లగొండ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ వైద్య కళాశాల వసతిగృహంలో ర్యాగింగ్‌ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో వైద్య కళాశాల హాస్టల్‌లో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్‌ చేస్తూ భౌతిక దాడికి పాల్పడినట్లు ఆ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ రామచంద్రు ఫిర్యాదు చేశారన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు నల్లగొండ వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో బీఎన్‌ఎ్‌స సెక్షన్లతో పాటు ర్యాగింగ్‌ చట్టం కింద ఒక జూనియర్‌ డాక్టర్‌, నలుగురు సీనియర్‌ విద్యార్థులపై కేసు నమోదు చేశామన్నారు. జూనియర్లపై దాడికి పాల్పడిన వారిని విచారించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ఈ కాలేజీలో తెలుగు రాని విద్యార్థులను ర్యాగింగ్‌ చేయడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. కొంతమంది విద్యార్థులు సెలవులు పెట్టి తమ ప్రాంతాలకు వెళ్లినట్లు సమాచారం.

Updated Date - Nov 20 , 2024 | 04:18 AM