విద్యతోనే దేశాభివృద్ధి : ఎమ్మెల్యే సామేల్
ABN , Publish Date - Jan 31 , 2024 | 12:00 AM
విద్యతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎ మ్మెల్యే మందుల సామేల్ అన్నారు.
విద్యతోనే దేశాభివృద్ధి : ఎమ్మెల్యే సామేల్
శాలిగౌరారం, జనవరి 30: విద్యతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎ మ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మండలంలోని బైరవునిబండ గ్రా మంలోని జడ్పీహెచఎ్‌సలో నిర్మించిన ప్రహరీ, తరగతి గదులు, వంట గదులను ప్రారంభించారు. ఆకారం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యమిస్తుందని అన్నారు. ఆసీనహార్ కాల్వకు రూ.1.25లక్షలు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిం చనున్నట్లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ ఎర్ర రణీలయాదగిరి, బైరవునిబండ సర్పంచ దండ రేణుకఅశోక్‌రెడ్డి, ఆకారం సర్పంచ, ఎంపీటీసీలు కందాల సమరంరెడ్డి, వలిశెట్టి చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, తహసీల్దార్ బీపాల్‌సింగ్, ఎంపీవో సుధాకర్, ఎంఈవో నాగయ్య, పీఆర్‌ఏఈ భరతచంద్ర, నాయకులు నరేందర్‌రెడ్డి, సురే్‌షరెడ్డి, జనార్ధన, పరమేష్ పాల్గొన్నారు.