Share News

హిడ్మా సొంతూరులో జాతీయ జెండా రెపరెపలు

ABN , Publish Date - Feb 19 , 2024 | 04:44 AM

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నాయకుడు, ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు మడివి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ సొంత ఊరైన పూవర్తి దండకారణ్యంలో ఆదివారం జాతీయ జెండా రెపరెపలాండింది.

హిడ్మా సొంతూరులో జాతీయ జెండా రెపరెపలు

చర్ల, ఫిబ్రవరి 18: మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నాయకుడు, ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు మడివి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ సొంత ఊరైన పూవర్తి దండకారణ్యంలో ఆదివారం జాతీయ జెండా రెపరెపలాండింది. ఇంతకాలం ఎర్రజెండాలు కనిచించిన చోట ఎట్టకేలకు జాతీయ జెండా ఎగిరింది. ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుకొండస్టేషన్‌ పరిధిలో ఈ పూవర్తి గ్రామం ఉంది. సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు ఏర్పాటు సందర్భంగా తొలిసారి గ్రామంలో జాతీయ జెండాను ఎస్పీ కిరణ్‌ చవాన్‌ ఎగుర వేశారు. మావోయిస్టు కంచుకోటలాంటి ఈ ప్రాంతంలో... హిడ్మాను పట్టుకొవడమే లక్ష్యంగా క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. పలు ఘటనల్లో వందల మంది పోలీసులను హతమార్చిన హిడ్మా తలపై సుమారు 45 లక్షల రివార్డు ఉండటం గమనార్హం.

Updated Date - Feb 19 , 2024 | 10:53 AM