మంథని, గుంజపడుగులో కొత్త ఆస్పత్రులు
ABN , Publish Date - Dec 04 , 2024 | 06:21 AM
తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం వైద్యానికేనని సోమవారం జరిగిన ఆరోగ్య ఉత్సవాల్లో చెప్పిన వైద్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ.. మంగళవారమే రెండు కొత్త
పెద్దపల్లి 50 పడకల ఆస్పత్రి 100 పడకలకు అప్‌గ్రేడ్
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం వైద్యానికేనని సోమవారం జరిగిన ఆరోగ్య ఉత్సవాల్లో చెప్పిన వైద్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ.. మంగళవారమే రెండు కొత్త ఆస్పత్రుల ఏర్పాటు, మరో ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అదే జిల్లా గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు జీవోలు జారీ చేశారు. ఈ రెండు ఆస్పత్రులకు కలిపి సుమారు రూ.25 కోట్లు కేటాయించారు. బుధవారం పెద్దపల్లిలో జరిగే ప్రజా పాలన విజయోత్సవాల సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆస్పత్రులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. పెద్దపల్లిలోని 50 పడకల ఆస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం రూ.51 కోట్లు కేటాయించారు.