డిస్కమ్‌ల్లో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్
ABN , Publish Date - Feb 01 , 2024 | 03:25 AM
విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఇప్పటి దాకా పనిచేసిన డైరెక్టర్లను తొలగించడంతో ఆ స్థానంలో కొత్త డైరెక్టర్ల నియామకానికి డిస్కమ్‌లు బుధవారం నోటిఫికేషన్ విడుదల
రెండు పంపిణీ సంస్థల్లో మొత్తం 8 పోస్టులు
హైదరాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఇప్పటి దాకా పనిచేసిన డైరెక్టర్లను తొలగించడంతో ఆ స్థానంలో కొత్త డైరెక్టర్ల నియామకానికి డిస్కమ్‌లు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశాయి. దక్షిణ డిస్కమ్‌లో నాలుగు, ఉత్తర డిస్కమ్‌లో నాలుగు డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటిదాకా దక్షిణ డిస్కమ్‌లో ఏడుగురు డైరెక్టర్లు ఉండగా... తాజాగా నాలుగు పోస్టులే భర్తీచేయాలని నిర్ణయించడం గమనార్హం. పూర్తిచేసిన దరఖాస్తులను మార్చి 1వ తేదీలోపు పంపించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.