పాత కరెంట్ చార్జీలే..
ABN , Publish Date - Mar 16 , 2024 | 05:02 AM
కొత్తగా వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్‌ఆర్), టారిఫ్ ప్రతిపాదనల పిటిషన్లు దాఖలు చేసేదాకా 2024-25 ఆర్థి క సంవత్సరంలో పాత కరెంట్ చార్జీలే (2023- 24లో ఖరారు చేసిన) వసూలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎ్‌సఈఆర్‌సీ) అనుమతిచ్చింది.
కొత్తగా పిటిషన్లు వేసేదాకా పాత చార్జీల వసూలుకు
ఈఆర్‌సీ అనుమతి.. ఉత్తర్వులు జారీ
అద నపు సర్‌చార్జీ యూనిట్‌కు రూ.1.40 ఖరారు
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కొత్తగా వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్‌ఆర్), టారిఫ్ ప్రతిపాదనల పిటిషన్లు దాఖలు చేసేదాకా 2024-25 ఆర్థి క సంవత్సరంలో పాత కరెంట్ చార్జీలే (2023- 24లో ఖరారు చేసిన) వసూలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎ్‌సఈఆర్‌సీ) అనుమతిచ్చింది. ప్రస్తుతానికి కొత్తగా పిటిషన్లు వేయలేమని, అప్పటిదాకా పాత చార్జీలే వసూలు చేసేందుకు అనుమతినివ్వాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో పాత చార్జీల వసూలుకు అనుమతిస్తూ ఈఆర్‌సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు మనోహర్‌రాజు, బి.కృష్ణయ్యలు శుక్రవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. దీంతో రెండు డిస్కమ్‌లతోపాటు సిరిసిల్ల సహకార విద్యుత్ సొసైటీ (సెస్)లో పాత చార్జీలు వర్తింపచేయనున్నారు. కొత్త పిటిషన్ వేసే దాకా పాత వీలింగ్ చార్జీలే వసూలు చేయనున్నారు. కొత్తగా పిటిషన్లు దాఖలు చేయాలని డిస్కమ్‌లకు ఈఆర్‌సీ ఆదేశాలిచ్చింది. ఇక టీఎస్ జెన్‌కో చార్జీలకు సంబంధించి కూడా ఈఆర్‌సీ ఉత్తర్వులు ఇచ్చింది. రెగ్యులర్ పిటిషన్ వేసే దాకా పాత స్థిర, ఇంధన చార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఇదిలా ఉండగా.. ఓపెన్ యాక్సె్‌స(బహిరంగ విపణి) నుంచి కరెంట్ కొనుగోలు చేసే వినియోగదారుల నుంచి యూనిట్‌కు రూ.1.40 అదనపు సర్‌చార్జీ కింద వసూలు చేసుకోవడానికి ఈఆర్‌సీ అనుమతిచ్చింది. 2024-25 ఆర్థిక సం వత్సరం తొలి అర్ధవార్షికం (1-4-2024 నుంచి 30-9-2024 దాకా)లో యూనిట్‌కు రూ.1.95 వసూలు చేసేందుకు డిస్కమ్‌లు పిటిషన్ వేయగా.. యూనిట్‌కు రూ.1.40కు అనుమతిచ్చారు. ఇక వినియోగ దారులు గ్రీన్ ఎనర్జీ నుంచి కరెంట్‌ను కొనుగోలు చేస్తే వారికి అదనపు సర్‌చార్జీ వర్తించదు.
జీరో బిల్లుపై నేడు ఉత్తర్వులు..
గృహజ్యోతి పథకం కింద 200యూనిట్ల దాకా గృహ వినియోగదారులకు ఉచితంగా ప్రభుత్వం కరెంట్‌ను సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్‌పై శనివారం ఈఆర్‌సీ ఉత్తర్వులు ఇవ్వనుంది. ముందస్తుగా ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేస్తే తప్ప జీరో బిల్లు జారీ చేయడానికి వీల్లేదని ఎలక్ట్రిసిటీ యాక్ట్ నిబంధనలున్నాయి. ఈ నేపథ్యంలో ఈఆర్‌సీ ఉత్తర్వులు వెలువరించనుంది.