మిగతా సేవలు ఎప్పుడో?
ABN , Publish Date - Jan 20 , 2024 | 11:51 PM
వైద్య పరీక్షల పేరుతో దోపిడీకి గురవుతున్న పేదల కు ఉపశమనం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం డయగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించింది.
తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రం ఏర్పాటు చేసి ఏడు నెలలు
20,367 మందికి 63,078 రోగ నిర్ధారణ పరీక్షలు
134 సేవలకు 74 మాత్రమే అందుబాటులోకి
ఖాళీ పోస్టులతో సేవలకు అంతరాయం
భువనగిరి టౌన, జనవరి 20 : వైద్య పరీక్షల పేరుతో దోపిడీకి గురవుతున్న పేదల కు ఉపశమనం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం డయగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించింది. అయితే యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఈ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించి ఏడు నెలలు గడుసు ్తన్నా నేటికీ సగం సేవలే అందుబాటులోకి వచ్చాయి. దీం తో మిగతా రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేట్ లేదా హైదరాబాద్‌లోని ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోం ది. 2023 జూలై 1న ప్రారంభమైన తెలంగాణ డయగ్నోస్టిక్స్‌లో డిసెంబరు 31 వరకు 20,367 మందికి 63,078 రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
భువనగిరి జిల్లా ఆసుపత్రిలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో 134 రోగ నిర్ధారణ పరీక్షల సేవలు ప్రజల కు అందాల్సి ఉంటుంది. కానీ నేటి వరకు కేవలం 74 పరీక్షలు మాత్రమే అందుబాటులో వచ్చాయి. వీటిలో అత్యధికంగా పరీక్షలు చేయించే 74 పరీక్షలు అందుబాటులోకి రావడం కాస్త శుభపరిణామం. మిగతా 60 పరీక్షలు కూడా దశల వారీగా అందుబాటులోకి వస్తాయని అధికారులు అంటున్నారు. కానీ అత్యధిక బిల్లు వేసే సిటీ స్కాన, ఎంఆర్‌ఐ, టూడీ ఈకో తదితర పరీక్షలు అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత ఉపశమనం లభించనుంది. కాగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.6వేల నుంచి రూ.10వేల వరకు ప్యాకేజీల రూపకంలో ప్రైవేట్ ల్యాబ్‌లు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వహించే విటమిన డీ, సీబీఎఫ్, థైరాయిడ్, కిడ్ని, లివర్, షుగర్, డెంగ్యూ, కామెర్లు, కలరా తదితర రోగ నిర్ధార ణ పరీక్షలు డయాగ్నోస్టిక్స్‌లో ఉచితంగా లభిస్తున్నా యి. మహిళల ప్రసవానికి ముందు నిర్వహించే ఏఎనసీ ప్రొఫైల్ పరీక్షలు, అల్ర్టా సౌండ్ స్కానింగ్, మమోగ్రఫీ, క్యాన్సర్ స్ర్కీనింగ్ టెస్టులు, డిజిటల్ ఎక్స్‌రే, ఈసీ జీ, తదితర సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే రోగులు నేరుగా పరీక్షల కోసం డయాగ్నోస్టిక్స్ కు వెళ్లే అవకాశం లేదు. ఏదేని ప్రభుత్వ ఆసుపత్రి, పీహెచసీలలో సేకరించిన శాంపిల్స్‌ను మాత్రమే డయాగ్నోస్టిక్స్‌లో పరీక్షించి సుమారు 8, 9 గంటల్లో ఆనలైనలో రిపోర్టులు ఇస్తున్నారు. మరిన్ని సందర్భాల్లో ప్రభుత్వ వైద్యుల రిఫరెన్సతో రోగులకు నేరుగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు 20,367 మందికి పరీక్షలు
జిల్లా ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్స్ సేవలు అందుబాటులోకి వచ్చిన 7నెలలుగా జిల్లాలోని 24 పీహెచసీలు, ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి 20,367 మందికి రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 63,078 పరీక్షలు నిర్వహించారు. ఆయా పీహెచసీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను నాలుగు వాహనాల ద్వారా భువనగిరి జిల్లా ఆసుపత్రిలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్స్‌కు తరలిస్తున్నారు. పరీక్ష నిర్వహించిన అనంతరం రిపోర్టులను పీహెచసీలు, రోగుల ఈమెయిల్‌కు అప్‌లోడ్ చేస్తారు. దీంతో ఇంటి వద్దనే రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులను 8, 9 గంటల లోపు పొందవచ్చును.
ఆలస్యానికి కారణాలివే..
రోగ నిర్ధారణకు సంబంధించి 134 పరీక్షలను ఉ చితంగా నిర్వహించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన తెలంగాణ గయాడ్నోస్టిక్ హబ్‌లో కేవలం 74 సేవలు మా త్రమే అందుబాటులోకి రాగా మిగతా 60 సేవల కోసం నిరీక్షించడానికి పలు కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఏడు నెలల కిందటే డ యాగ్నోస్టిక్స్ ఏర్పాటు జరిగిందని దశల వారీగా మిగ తా సేవలు కూడా అందుబాటులోకి వస్తాయంటున్నారు. అయితే గుండె జబ్బులు పెరిగిపోతున్న నేపథ్యంలో టూడీ ఈవో తదితర పరీక్షలు తప్పనిసరి అ య్యాయి. అందుకు సంబంధించిన ల్యాబ్ సామాగ్రి డయాగ్నోస్టిక్స్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి ని వినియోగించే అర్హులైన డాక్టర్లు లేకపోవడంతో అ వి నిరుపయోగంగా మారాయి. ఆ పరీక్షలు నిర్వహించే డాక్టర్ల నియామకాలకోసం అధికారులు పలుమార్లు నోటిఫికేషన జారీ చేసినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే వేతనానికి వైద్యులు సుముఖత చూపకపోవడంతో ఆపోస్టులు ఖాళీగానే ఉంటూ రోగులకు సేవ లు అందని పరిస్థితి నెలకొంది. మరొకొన్ని నిర్ధారణ పరీక్షల కోసం యంత్రాలు సమకూరినా అందుకు అవసరమైన రసాయనాల సరఫరా లేకపోతుండటం, పూర్తిస్థాయి ల్యాబ్ టెక్నిషియన్ల నియామకాలు లేకపోవడం కూడా ఇబ్బందిగా మారింది.
డయాగ్నోస్టిక్స్‌తో కచ్చితత్వ రిపోర్టులు
తెలంగాణ డయగ్నోస్టిక్స్‌లో నిర్వహించే రోగ నిర్ధారణ పరీక్షలకు కచ్చితత్వంతో కూడిన రిపోర్టులు ఉండడం ప్రత్యేకత. ఉచితంగా అందుతున్న సేవలతో ప్రజలకు ప్రైవేట్ ల్యాబ్‌ల ఆర్థిక దోపిడి నుంచి విముక్తి లభిస్తోంది. మొగతా సేవలు దశల వారీగా అందుబాటులోకి వస్తాయి. ఖాళీల భర్తీకి నిరంతరం నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఆ పోస్టులు భర్తీ అయితే మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి.
- డాక్టర్ చిన్నా నాయక్, సూపరింటెండెంట్