CM Revanth: సీఎం రేవంత్ పేద విద్యార్థులకు దేవుడు: ఓయూ విద్యార్థి నేతలు
ABN , Publish Date - Jun 13 , 2024 | 03:20 AM
కార్పొరేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై ఓయూ విద్యార్థి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సీఎం నివాసంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): కార్పొరేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై ఓయూ విద్యార్థి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సీఎం నివాసంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్ మాట్లాడుతూ, కేసీఆర్ పదేళ్ల పాలనలో రేషనలైజేషన్ పేరిట 4 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం రేవంత్ రూ. 2వేల కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వ పాఠశాల నేపథ్యం నుంచే వచ్చిన సీఎం ఆ స్కూళ్ల అభివృద్ధికి పాటు పడుతున్నారని అన్నారు. అనంతరం విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ నేత మానవతారాయ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ పేద విద్యార్థుల పాలిట దేవుడని అన్నారు.