Share News

ఖమ్మానికి ఔటర్‌ రింగురోడ్డు

ABN , Publish Date - Jan 24 , 2024 | 03:06 AM

ఖమ్మం నగరానికి ఔటర్‌ రింగురోడ్డు వచ్చేలా నాలుగువైపులా జాతీయ రహదారులను ప్రతిపాదించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం నగరానికి నాలుగువైపులా

ఖమ్మానికి ఔటర్‌ రింగురోడ్డు

ఆక్రమిత ప్రభుత్వ భూములన్నీ వెనక్కి: తుమ్మల

ఖమ్మం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం నగరానికి ఔటర్‌ రింగురోడ్డు వచ్చేలా నాలుగువైపులా జాతీయ రహదారులను ప్రతిపాదించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం నగరానికి నాలుగువైపులా ప్రస్తుతం పనులు జరుగుతున్న ఖమ్మం నుంచి సూర్యాపేట, దేవరపల్లి, కోదాడ, కురవికి, నాగ్‌పూర్‌ నుంచి అమరావతి వెళ్లే రహదారులను గతంలోనే ఔటర్‌ రింగురోడ్డు ఏర్పాటు చేసేలా ప్రతిపాదించామని చెప్పారు. ఖమ్మం కార్పొరేషన్‌ కార్యాలయంలో మంగళవారం పలు అంశాలపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములపై విచారణ నిర్వహించి వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టాలనీ అధికారులను ఆదేశించారు. పూర్తయిన పనులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్‌ వారు పరిశీలించిన అనంతరమే బిల్లులు మంజూరు చేయాలని ఆయన సూచించారు.

Updated Date - Jan 24 , 2024 | 10:58 AM