Share News

పెండింగ్‌ పనులను పూర్తి చేయాలి : ఎమ్మెల్యే

ABN , Publish Date - Nov 17 , 2024 | 01:02 AM

మిర్యాలగూడ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో పెండింగ్‌లో అభి వృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

 పెండింగ్‌ పనులను పూర్తి చేయాలి : ఎమ్మెల్యే

మిర్యాలగూడ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో పెండింగ్‌లో అభి వృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడలో చేపట్టిన యూజీడీ, హైవే విస్తరణ పనులను శనివారం పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ, పబ్లిక్‌ హెల్త్‌, నేషనల్‌ హైవే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మధ్యలోనే నిలిచిన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను త్వరగా ప్రారంభించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చాలన్నారు. నిరుపయోగంగా మారిన పాత డ్రైనేజీ పైపుల్లో ఉన్న వ్యర్ధాలను తొ లగించి కొత్త పైపులైన్ల ఏర్పాటు, కాల్వల నిర్మాణం చేపట్టాలన్నారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు, హైవే మరమ్మతుల పనులు పూర్తి చేయాలన్నారు. పట్టణ, శివారుప్రాంతాల్లో లైటింగ్‌ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు,ఈఈ మనోహరి, మున్సిపల్‌ కమిషనర్‌ యూసూఫ్‌, హైవే అథారిటీ అధికారులు, కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 01:02 AM