Share News

నిడమనూరులో పోస్టల్‌ ఉద్యోగి అదృశ్యం

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:52 PM

నిడమనూరులో ఓ యువతి అదృశ్యమైంది.

 నిడమనూరులో పోస్టల్‌ ఉద్యోగి అదృశ్యం

నిడమనూరులో పోస్టల్‌ ఉద్యోగి అదృశ్యం

నిడమనూరు, ఏప్రిల్‌ 15: నిడమనూరులో ఓ యువతి అదృశ్యమైంది. నిడమనూరు ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ రాష్ట్రం పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రా మానికి చెందిన రమావత్‌ శ్రీను కుమార్తె ఉదయశ్రీ (21) నిడమనూరు మండల కేంద్రంలోని పోస్టల్‌ కార్యాలయంలో తొమ్మిది నెలలుగా పోస్టుఉమెన్‌గా విధులు నిర్వహిస్తోంది. మిర్యాలగూడలోని తన బాబాయి ఇస్లావత్‌ రవి ఇంట్లో ఉంటూ ప్రతీరోజు కార్యాలయానికి వస్తూ విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఈనెల 12వ తేదీన డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి ఇంతవరకు ఇంటికి రాలేదు. చుట్టుపక్కల మరియు బంధువుల ఇళ్లలో విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో తన కుమార్తె కనిపించడం లేదని ఉదయశ్రీ తండ్రి శ్రీను సోమవారం నిడమనూరు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్‌ కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 16 , 2024 | 08:09 AM