61.33శాతం మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూలు
ABN , Publish Date - Apr 01 , 2024 | 10:16 PM
ఈ యేడాది ఆస్తి పన్ను వసూళ్ల గడువు ముగిసింది. వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో కలిసి ఈ యేడాది 2023-2024 మార్చి 31 వరకు 61.33 శాతం ఆస్తి పన్ను వసూలైయింది.
ప్రథమస్థానంలో వికారాబాద్.. చివరిస్థానంలో తాండూరు
జీఎ్‌సడీపీ లక్ష్యాన్ని చేరుకోని తాండూరు మున్సిపాలిటీ
కేంద్ర నిధులు రావడం కష్టమే..!
వృద్ధ్ది రేటును సాధించిన వికారాబాద్, పరిగి, కొడంగల్
తాండూరు, ఏప్రిల్ 1: ఈ యేడాది ఆస్తి పన్ను వసూళ్ల గడువు ముగిసింది. వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో కలిసి ఈ యేడాది 2023-2024 మార్చి 31 వరకు 61.33 శాతం ఆస్తి పన్ను వసూలైయింది. గతేడాది నాలుగు మున్సిపాలిటీల్లో కలిసి రూ. 10కోట్ల 65 లక్షలు వసూలు చేయగా ఈ యేడాది రూ. 10 కోట్ల 47 లక్షలు వసూలు చేశారు. 1 ఏప్రిల్ 2023 నుంచి 2024 మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంలో 100శాతం ఆస్తి పన్ను లక్ష్యం కాగా, 90శాతం వడ్డీ రాయితీని కూడా ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. దీంతో మార్చి నెలలో బకాయిలు ఎక్కువగా వసూలయ్యాయి. ఈయేడాది (2023-2024) ఆర్థిక సంవత్సరంలో పన్నువసూళ్లలో వికారాబాద్ మున్సిపాలిటీ ప్రథమస్థానంలో నిలిచింది. కొడంగల్ మున్సిపాలిటీ మూడో స్థానంలో నిలిచింది. వికారాబాద్ మున్సిపాలిటీ జిల్లాలోనే 91.02శాతం సాధించగా పరిగి మున్సిపాలిటీ 79.02 శాతం సాధించి ద్వితీయస్థానంలో నిలవగా, కొడంగల్ మున్సిపాలిటీ74.40శాతంతో మూడోవ స్థానం, తాండూరు మున్సిపాలిటీ 44.15శాతంతో చివరి స్థానంలో నిలిచింది.
గతేడాది..
గతేడాది (2022-23) తాండూరు మున్సిపాలిటీ రూ. 4కోట్ల 10 లక్షల 65వేలు పన్నులు వసూలు చేయగా ఈ ఏడాది (2023-24)లో రూ. 4కోట్ల 30 లక్షల 10వేలు వసూలు చేసింది. గతేడాది కంటే ఈ యేడాది విస్తృత ప్రచారం రెడ్ నోటీసులు జారీ చేసిన రూ. 19లక్షలు మాత్రమే అధికంగా వసూలు చేశారు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో కమిషనర్, రెవెన్యూ ఆఫీసర్ , రెవెన్యూఇన్‌స్పెక్టర్, కలెక్టర్ ఉన్నప్పటికీ ఆస్తిపన్నులు ఆశించినంత వసూలు కాలేదు. ఈ ఏడాది జీఎ్‌సడీపీ (వృద్ధిరేటు ) లక్ష్యాన్ని సాధించబడకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిధులు రావడం కష్టమే. జిల్లాలోని వికారాబాద్ మున్సిపాలిటీ గతేడాది రూ. 3 కోట్ల 56 లక్షల 56వేలు వసూలు చేయగా ఈ యేడాది రూ. 3కోట్ల 34లక్షల 9వేలు సాధించి వృద్ధిరేటును సాధించింది. పరిగి మున్సిపాలిటీ గతేడాది కోటి 38లక్షల 85వేలు కాగా, ఈ ఏడాది రూ. కోటి 11లక్షల 83వేలు వసూలు చేసి వృద్ధిరేటు సాధించగా, తాండూరు మున్సిపాలిటీ గతేడాది రూ. 4 కోట్ల 40 లక్షల 65వేలు వసూలు చేయగా ఈ ఏడాది రూ. 4 కోట్ల 30 లక్షల 10వేలు వసూలు చేసింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా రూ. 40 లక్షల పైనా ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కోంటున్నారు. జీఎ్‌సడీపీ గతేడాది ముందుగానే చేరుకోగా, ఈసారి వెనుకబడి పోయింది.
పన్ను వసూళ్ల వివరాలు
మున్సిపాలిటీ డిమాండ్ వసూలు శాతం
రూ. కోట్లలో
వికారాబాద్ 367.06 334.09 91.02
తాండూరు 972. 59 430.10 44.15
కొడంగల్ 149. 24 111.04 74.40
పరిగి 217.44 171.83 79.02
మొత్తం 1706.33 1047.06 61.33