గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Nov 23 , 2024 | 11:24 PM
గురుకుల పాఠశాలల్లో ఖచ్చితమైన మెనూ పాటించాలని, సరఫరా అయ్యే బియ్యం, కూర గాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు వండి వడ్డించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : గురుకుల పాఠశాలల్లో ఖచ్చితమైన మెనూ పాటించాలని, సరఫరా అయ్యే బియ్యం, కూర గాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు వండి వడ్డించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. శని వారం నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఉయ్యా లవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయం లో విద్యార్థులకు వండిన భోజన నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలోని సమస్య లను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని స్టోర్‌రూమ్, డార్మెటరీ హాల్‌ను పరిశీలించారు.
భోజనం నాణ్యతగా ఉండాలి : కలెక్టర్
విద్యార్థులకు అందించే భోజనం పరిశుభ్రం గా, నాణ్యతతో కూడినదై ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, సంక్షేమ హా స్టల్స్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆసుపత్రుల్లో అందించే ఆహారంపై శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు సీతారామారావు, దేవ సహాయం, సంబంధిత జిల్లా అధికారులు, బీసీ, ఎస్సీ గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో నిర్వహణపై అధికారులతో సమీక్షించారు.
సర్వే వేగవంతం చేయాలి : కలెక్టర్
గ్రామాలు, మునిసిపా లిటీలలో కొనసా గుతున్న సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మంది రంలో శనివా రం సాయంత్రం కలెక్టర్ వరి, పత్తి కొనుగోళ్లు, సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేం ద్రాల ద్వారా ఇప్పటి దాకా ఎన్ని క్వింటాళ్ల వరి కొనుగోలు చేశారని సివిల్ సప్లయ్ అధికా రులను అడిగి తెలుసుకున్నారు. మండలాల వారీగా సామాజిక సర్వే ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ప్రశ్నించారు. సర్వే పూర్తి చేసిన ఫారాల భద్రత స్టోరేజ్‌పై ఎంపీడీవో, కమిష నర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కే.సీతారామా రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం తదితరులు పాల్గొన్నారు.