Share News

నవభారత నిర్మాణంలో ఇంజనీర్లది కీలకపాత్ర

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:53 PM

నవభారత నిర్మాణంలో ఇంజనీర్లదే కీలకపాత్ర అని నల్ల మల్లారెడ్డి విద్యాసంస్థల చైర్మన్‌ నల్ల మల్లారెడ్డి తెలిపారు.

నవభారత నిర్మాణంలో ఇంజనీర్లది కీలకపాత్ర
పట్టభద్రులైన ఇంజనీర్లకు సర్టిఫికెట్లు అందజేస్తున్న చైర్మన్‌ నల్ల మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌ రూరల్‌, సెప్టెంబరు 15: నవభారత నిర్మాణంలో ఇంజనీర్లదే కీలకపాత్ర అని నల్ల మల్లారెడ్డి విద్యాసంస్థల చైర్మన్‌ నల్ల మల్లారెడ్డి తెలిపారు. పోచారం మున్సిపాలిటీ, దివ్యానగర్‌లోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్‌ డే ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పట్టబద్రులైన ఇంజనీర్లకు పట్టా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్ల మల్లారెడ్డి ఎడ్యుకేషన్‌ సొసైటీ చైర్‌పర్సన్‌ కేతిరెడ్డి సంధ్య, డైరెక్టర్‌ నల్ల దివ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:53 PM