Share News

రైతులకు రూ.100 కోట్ల రుణాలు

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:06 AM

రైతులు దీర్ఘకాలిక రుణాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్‌, ఆమనగల్లు పీఏసీఎస్‌ చైర్మన్‌ గంప వెంకటేశ్‌ కోరారు.

రైతులకు రూ.100 కోట్ల రుణాలు
మాట్లాడుతున్న గంప వెంకటేశ్‌

ఆమనగల్లు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రైతులు దీర్ఘకాలిక రుణాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్‌, ఆమనగల్లు పీఏసీఎస్‌ చైర్మన్‌ గంప వెంకటేశ్‌ కోరారు. ఆమనగల్లు పీఏసీఎస్‌ ద్వారా ఈ ఏడాది రూ.100 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆమనగల్లు పీఏసీఎస్‌ కార్యాలయంలో మంగళవారం మాడ్గుల పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుమల్‌రెడ్డి, డైరెక్టర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్‌ మాట్లాడారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల శ్రేయస్సును కాంక్షించి పీఏసీఎస్‌ ద్వారా ఇతోధికంగా రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆమనగల్లు పీఏసీఎస్‌ ద్వారా రూ.3 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయించి ఇప్పటి వరకు రూ.70 లక్షలు అందించినట్లు వెల్లడించారు. నవంబరు మొదటి వారంలో ఆమనగల్లు పీఏసీఎస్‌ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు వెంకటేశ్‌ తెలిపారు. రైతులను మోసగించే వారు ఎంతటి వారైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైస్‌ చైర్మన్‌ సత్యం, డైరెక్టర్లు వీరయ్య, వెంకటయ్య, డీసీసీబీ మేనేజర్‌ గోపాల్‌, సీఈవో దేవేందర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:06 AM