Share News

నంబర్‌ ప్లేట్‌ లేని 14 వాహనాలు సీజ్‌

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:44 PM

మండల పరిధిలోని మన్నెగూడ జంక్షన్‌ వద్ద పరిగి సీఐ శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో చెన్‌గోముల్‌ ఎస్‌ఐ మధుసూదనరెడ్డితో కలిసి వాహనాలు తనిఖీ చేశారు.

నంబర్‌ ప్లేట్‌ లేని 14 వాహనాలు సీజ్‌
మన్నెగూడ జంక్షన్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు

పూడూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని మన్నెగూడ జంక్షన్‌ వద్ద పరిగి సీఐ శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో చెన్‌గోముల్‌ ఎస్‌ఐ మధుసూదనరెడ్డితో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో 14 నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలు పట్టుకుని సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సీఐ ట్రాఫిక్‌ నిబంధనలపై వాహనదారులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఈ తనిఖీల్లో ప్రొబిషనరీ ఎస్‌ఐలు కవిత, పూజ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 11:44 PM