వీధి కుక్కల దాడిలో 15 గొర్రెలు మృత్యువాత
ABN , Publish Date - Mar 20 , 2024 | 12:14 AM
మండలంలోని కొర్రెములకు చెందిన మెట్టురమేష్, మొగుళ్ళ అయిలయ్య గొర్రెల మందలపై వీధికుక్కలు మంగళవారం ఉదయం దాడిచేసి 15గొర్రెలను చంపేశాయి.
ఘట్‌కేసర్ రూరల్, మార్చి 19: మండలంలోని కొర్రెములకు చెందిన మెట్టురమేష్, మొగుళ్ళ అయిలయ్య గొర్రెల మందలపై వీధికుక్కలు మంగళవారం ఉదయం దాడిచేసి 15గొర్రెలను చంపేశాయి. వీధికుక్కలు గొర్రెలతో పాటు వాటిపిల్లలపై దాడిచేసి చంపేశాయి. దీంతో దాదాపు రూ.లక్షన్నర నష్టం వాటిల్లిందని గొర్రె కాపారులు మెట్టు రమేష్, మొగుళయ్యలు ఆరోపించారు. ఎంతో కష్టపడి పెంచుకుంటున్న గొర్రెలు కుక్కలదాడిలో మృతిచెందడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. వీధికుక్కలను పంచాయతీ వారు జీహెచ్‌ఎంసీ అధికారులకు పట్టించాలని కోరారు. పరిహారం అందేలా అధికారులు చొరవచూపాలని కోరారు.