Share News

చెనిగేష్‌పూర్‌లో 15 గొర్రెలు చోరీ

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:06 AM

గ్రామ శివారులోని మందలో నుంచి 15గొర్రెలు చోరీ గురయ్యాయి. ఈ ఘటన మండలంలోని చెనిగే్‌షపూర్‌ గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

చెనిగేష్‌పూర్‌లో 15 గొర్రెలు చోరీ

తాండూరు రూరల్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రామ శివారులోని మందలో నుంచి 15గొర్రెలు చోరీ గురయ్యాయి. ఈ ఘటన మండలంలోని చెనిగే్‌షపూర్‌ గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుర్వ దస్తప్ప తన వద్ద ఉన్న 70గొర్రెలను గ్రామ సమీపంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద మందలో వదిలారు. మంద చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. అయితే వాటిలో నుంచి 15గొర్రెలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం మందను గమనించగా, వాటిలో నుంచి 15గొర్రెలను గుర్తించారు. మందవద్ద వాహనం అచ్చులు పడటంతో కరన్‌కోట్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు. అయితే గత సంవత్సరం కూడా తన మందలో గొర్రెల మందలో కుక్కను వదిలారని, ఆ ఘటలో 20 గొర్రెపిల్లలను కుక్క దాడి చేసి చంపేసిందని వాపోయారు. ఇప్పుడు కూడా తన గొర్రెలను ఎత్తుకెళ్లారని, ఎవరో ఇది కావాలనే చేస్తున్నారని ఆయన ఆరోపించాడు. 15 గొర్రెలు చోరీ కావడంతో రూ.లక్షా 70వేల వరకు తాను నష్టపోయానని బాధితుడు వాపోయాడు.

Updated Date - Dec 27 , 2024 | 12:06 AM