వైన్‌షాపునకు కన్నం.. 6 మద్యం బాటిళ్లు చోరీ
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:39 PM
వైన్‌షాపునకు కన్నం వేసిన గుర్తుతెలియని దండుగులు.. 6 మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లి పోయారు.
శంషాబాద్ రూరల్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): వైన్‌షాపునకు కన్నం వేసిన గుర్తుతెలియని దండుగులు.. 6 మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లి పోయారు. పాల్మాకులలో ఎస్‌వీపీ లక్ష్మినర్సింహ వైన్‌షాపులో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగలు షాపు వెనకభాగంలో గోడకు కన్నంవేసి అందులోంచి వెళ్లి 6 ఫుల్‌బాటిళ్లు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి మంకీక్యాప్ ధరించిన వ్యక్తి దొంగతనం చేసినట్లు గుర్తించినట్లు సీఐ నరేందర్‌రెడ్డి తెలిపారు.