పశువులను కబేళాలకు తరలిస్తున్న వ్యక్తిపై కేసు
ABN , Publish Date - Jun 08 , 2024 | 11:18 PM
పశువులను తాళ్లతో కట్టేసి కబేళాలకు తరలిస్తున్న ఓ వ్యక్తిపై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఘట్‌కేసర్ రూరల్, జూన్ 8: పశువులను తాళ్లతో కట్టేసి కబేళాలకు తరలిస్తున్న ఓ వ్యక్తిపై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సైదులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్ మండలంలోని అవుషాపూర్ కేపాల్ వద్ద బక్రీద్ సందర్భంగా ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. శనివారం సాయంత్రం అశోక్ లేల్యాండ్ వాహనాన్ని ఆపి సోదా చేశారు. అందులో తాళ్లతో కట్టేసి నీళ్లు లేకుండా 3పశువులను తరలిస్తుండగా గుర్తించారు. యాదాద్రీ-భువనగిరి జిల్లా, రామన్నపేటకు చెందిన అశోక్ లైల్యాండ్ డ్రైవర్ మహ్మద్ ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. సంగారెడ్డికి పశువులను తరలిస్తున్నట్లు తెలిపారు. పశువులను నగరంలోని జియాగూడ గోశాలకు తరలించారు. ఈ మేరకు ఇస్మాయిల్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.