Share News

ఎండోమెంట్‌ భూమిలో చెట్లు తొలగించి చదును చేసిన ఇద్దరిపై కేసు

ABN , Publish Date - Aug 04 , 2024 | 11:44 PM

ఎండోమెంట్‌ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి చెట్లు తొలగించి, చదును చేసిన ఇద్దరిపై ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎండోమెంట్‌ భూమిలో చెట్లు తొలగించి చదును చేసిన ఇద్దరిపై కేసు

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆగస్టు 4: ఎండోమెంట్‌ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి చెట్లు తొలగించి, చదును చేసిన ఇద్దరిపై ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సైదులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఘట్‌కేసర్‌ రెవెన్యూ పరిధి సర్వేనెంబర్‌ 210లోని ఎకరం భూమిలో చెట్లు తొలగించి చదును చేసిన వంగ నాగిరెడ్డి, ఇదే సర్వేనెంబర్‌లోని మరో 39గుంటల భూమిలో చదును చేస్తున్న కొమ్మిడి మహిపాల్‌రెడ్డిలపై ఈవో భాగ్యలక్ష్మి ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Aug 04 , 2024 | 11:44 PM