Share News

పేకాడుతున్న 8 మందిపై కేసు నమోదు

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:54 PM

పేకాడుతున్న ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు చెన్‌గోముల్‌ ఎస్‌ఐ మధుసూదనరెడ్డి తెలిపారు.

పేకాడుతున్న 8 మందిపై కేసు నమోదు

పూడూరు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పేకాడుతున్న ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు చెన్‌గోముల్‌ ఎస్‌ఐ మధుసూదనరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సోమన్‌గుర్తి గ్రామశివారులో సోమవారం పేకాడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి నర్సింహులు, యాదయ్య, సత్తయ్య, మల్లేష్‌, రాములు, యాదయ్య, చిన్నయ్య, రమేష్‌ అనే వ్యక్తులు పేకాడుతుండగా పట్టుకున్నారు. వారి నుంచి పేకముక్కలు, రూ.1310 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ు.

Updated Date - Dec 31 , 2024 | 11:54 PM