Share News

ఘనంగా బతుకమ్మ సంబురాలు

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:42 AM

ధారూరులోని వివిధ కాలనీలలో మహిళలు బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకున్నారు.

ఘనంగా బతుకమ్మ సంబురాలు
కొడంగల్‌: బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది

ధారూరు, అక్టోబరు 9: ధారూరులోని వివిధ కాలనీలలో మహిళలు బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకున్నారు. వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలను తయారుచేసి పూజలు చేశారు. మహిళలు, యువతులు బుధవారం రాత్రి బతుకమ్మలతో స్థానిక వీరభద్రేశ్వర ఆలయం వరకు ఉరేగింపుగా వెళ్లి బతుకమ్మల చుట్టూ తిరగుతూ పాటలు, పాడుతూ ఆడారు. అనంతరం స్థానిక చెన్నయ్య నీటి కుంటలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

మోమిన్‌పేట్‌: మండలంలోని అమ్రాదికలాన్‌లో బుధవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగు, రంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలతో గ్రామ పురవీధుల మీదుగా ఊరేగించారు.

మర్పల్లి: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో బతుకమ్మ సంబురాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. డప్పుల చప్పుళ్లతో బతుకమ్మలను గ్రామాల్లో పురవీధుల మీదుగా బయలుదేరి సమీప చెరువులు, కుంటల్లో నిమజ్ఞనం చేశారు.

కొడంగల్‌: నియోజకవర్గంలోని బొంరాస్‌పేట్‌, దుద్యాల్‌, కొడంగల్‌ మండలాల్లోని అన్ని శాఖల అధికారులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ముందు బుధవారం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. రంగు, రంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలతో ఆటాపాటలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను కొడంగల్‌ శివారులో నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్‌ తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 12:42 AM