Share News

త్వరలో కొత్తూర్‌కు జూనియర్‌ కళాశాల

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:10 AM

కొత్తూర్‌ మండల కేంద్రానికి త్వరలో జూనియర్‌ కళాశాల మంజూరు కానుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తెలిపారు. స్థానిక కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయం ఆవరణలో సర్వశిక్షా అభియాన్‌ పథకం కింద దాదాపు 3.50కోట్లతో నిర్మించనున్న అదనపు తరగతుల భవన నిర్మాణం పనులను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.

త్వరలో కొత్తూర్‌కు జూనియర్‌ కళాశాల
కొత్తూర్‌ : కేజీబీవీలో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

కొత్తూర్‌, అక్టోబరు 9: కొత్తూర్‌ మండల కేంద్రానికి త్వరలో జూనియర్‌ కళాశాల మంజూరు కానుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తెలిపారు. స్థానిక కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయం ఆవరణలో సర్వశిక్షా అభియాన్‌ పథకం కింద దాదాపు 3.50కోట్లతో నిర్మించనున్న అదనపు తరగతుల భవన నిర్మాణం పనులను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శంకర్‌ మాట్లాడుతూ పారిశ్రామికంగా, వ్యాపారపరంగా దినాదినాభివృద్ధి చెందుతున్న కొత్తూర్‌ మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటులో గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కొత్తూర్‌-జేపీ దర్గా, కొత్తూర్‌-కుమ్మరిగూడ రోడ్లను ప్రజలకు వీలుగా ఉన్నంతవరకే రోడ్డును నిర్మిస్తామని, ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్‌ చైౖర్‌పర్సన్‌ లావణ్యదేవేందర్‌యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ రవీందర్‌, కౌన్సిలర్‌ సోమ్లనాయక్‌, కాంగ్రెస్‌ మున్సిపల్‌, మండల శాఖల అధ్యక్షులు జె.సుదర్శన్‌గౌడ్‌, హరినాథ్‌రెడ్డి, నాయకులు అంబటి ప్రభాకర్‌, వీరమోని దేవేందర్‌ముదిరాజ్‌, ఇందూరి శ్రీనివాస్‌, కర్రొళ్ల సురేందర్‌, జగన్‌గౌడ్‌, ఎమ్మె సత్తయ్య, మసుపుల మహేందర్‌, పాశం కృష్ణ, కోటేశ్వర్‌, శివశంకర్‌, అక్కవానిగూడ రాజు, చిలకమర్రి నర్సింహ, సాయితేజ, తదితరులు పాల్గొన్నారు.

పేదల వైద్యానికి ప్రభుత్వ సహకారం

షాద్‌నగర్‌ అర్బన్‌ : పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తున్నదని ఎమ్మెల్యే శంకర్‌ తెలిపారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గంలోని 76మందికి రూ. 19,39,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం పొందిన పేదలకు ప్రభుత్వం విరివిగా ఆర్థిక సాయం అందిస్తూనే ఉంటుందని, ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలను కల్పించి, మంచి వైద్యం అందించడానికి చర్యలు తీసుకుందన్నారు. నియోజకవర్గంలోని అ న్ని మండలాల ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 12:10 AM