Share News

పొంచి ఉన్న ప్రమాదం

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:14 AM

ఆదిభట్ల మున్సిపాలిటీ మంగల్‌పల్లి నుంచి కొంగరకలాన్‌ మీదుగా కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో కల్వర్టు శిథిలమై కుంగిపోయింది. దాంతో అక్కడ ప్రమాదం పొంచి ఉంది. సింగిల్‌గా ఉన్న ఈ రోడ్డును విస్తరించినా ఇక్కడ ఫిరంగి నాలాపై ఉన్న కల్వర్టుకు మరమ్మతులు చేయలేదు.

పొంచి ఉన్న ప్రమాదం
మంగల్‌పల్లి-కొంగరకలాన్‌ దారిలో కల్వర్టు

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మంగల్‌పల్లి-కొంగరకలాన్‌ రోడ్డులో ధ్వంసమైన కల్వర్టు

తరచూ ప్రమాదాలు.. పట్టించుకోని అధికారులు

అదిభట్ల, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆదిభట్ల మున్సిపాలిటీ మంగల్‌పల్లి నుంచి కొంగరకలాన్‌ మీదుగా కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో కల్వర్టు శిథిలమై కుంగిపోయింది. దాంతో అక్కడ ప్రమాదం పొంచి ఉంది. సింగిల్‌గా ఉన్న ఈ రోడ్డును విస్తరించినా ఇక్కడ ఫిరంగి నాలాపై ఉన్న కల్వర్టుకు మరమ్మతులు చేయలేదు. ఆదిభట్ల, ఎంపీపటేల్‌గూడ నుంచి వచ్చిన వరద నీటికి కల్వర్టు పూర్తిగా కుంగిపోయింది. కలెక్టరేట్‌కు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల మండలాలకు చెందిన ప్రజలు, కలెక్టరేట్‌ ఉద్యోగులు నిత్యం రాకపోకలు కొనసాగిస్తారు. ఈ కల్వర్టు వద్ద నెలల వ్యవధిలో పదుల సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత నవంబరులో ఓ కారు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోడ్డుపై నిత్యం వందలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా రద్దీ ఎక్కువయ్యింది. అయితే, ఈ రోడ్డు విస్తరణ చేపట్టినా కల్వర్డుకు మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:14 AM