Share News

పది నెలల శిశువుకు అరుదైన వ్యాధి

ABN , Publish Date - Jul 27 , 2024 | 11:59 PM

అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న పాపకు వైద్య సాయాన్ని అందిస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పాప తల్లిదండ్రులకు భరోసా ఇవ్వగా ఆ వెంటనే సీఎం కార్యాలయం స్పందించింది.

పది నెలల శిశువుకు అరుదైన వ్యాధి

ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన తల్లిదండ్రులు

చికిత్స కోసం స్పందించిన సీఎం కార్యాలయం

ఇబ్రహీంపట్నం, జూలై 27: అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న పాపకు వైద్య సాయాన్ని అందిస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పాప తల్లిదండ్రులకు భరోసా ఇవ్వగా ఆ వెంటనే సీఎం కార్యాలయం స్పందించింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లికి చెందిన పొన్నాల రాజశేఖర్‌-తేజశ్రీ దంపతులకు పది నెలల పాప ఆరాధ్య గాచర్‌ డిసీజ్‌(లైసోమల్‌ స్టోరేజ్‌ డిజార్డర్‌)తో బాధపడుతోంది. చిన్నారికి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సుమారు రూ.20-25లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే వారికి వైద్య ఖర్చులు భరించడం స్థోమత లేక పీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్‌రెడ్డిని సంప్రదించారు. ఆయన శనివారం భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి విషయం వివరించారు. ఎంపీ వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి సహాయ కార్యదర్శి సంగీత సత్యనారాయణతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ పాపకు వైద్యం చేయించే బాధ్యత తనదని కూడా ఎంపీ భరోసా చెప్పారు. కాగా అదే సాయంత్రం సీఎంవో కార్యాలయం నుంచి పాప తండ్రి రాజశేఖర్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న అధికారులు లక్డీకాపూల్‌ సీఎన్‌జే ఆసుపత్రిలో సోమవారం పాపను చేర్చాలని తెలిపారని రాజశేఖర్‌ చెప్పారు.

Updated Date - Jul 27 , 2024 | 11:59 PM