Share News

చెరువులో యువకుడు గల్లంతు

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:00 AM

చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. ఈ ఘటన మేడ్చల్‌ మండలం డబిల్‌పూర్‌లో చోటుచేసుకుంది.

చెరువులో యువకుడు గల్లంతు

మేడ్చల్‌ టౌన్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. ఈ ఘటన మేడ్చల్‌ మండలం డబిల్‌పూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డబీల్‌పూర్‌ గ్రామానికి చెందిన రాజేంద్ర బారిక్‌(25) శుక్రవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. కాగా చెరువు ఒడ్డున రాజేందర్‌ సైకిల్‌, సెల్‌ఫోన్‌, దుస్తులు పడి ఉండటం గమనించిన స్థానికులు రాజేందర్‌ నీటమునిగి ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో సాయంత్రం చీకటి పడేంత వరకు చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా రాజేంద్ర బారిక్‌ ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం ఉదయం తిరిగి గాలింపుచర్యలు చేపడుతామని పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 07 , 2024 | 12:00 AM