Share News

మెడలోంచి మంగళసూత్రం అపహరణ

ABN , Publish Date - Nov 25 , 2024 | 12:08 AM

ఒంటరిగా ఉన్న మహిళ మెడలోంచి మంగళసూత్రం(రోల్డ్‌గోల్డ్‌) అపహరించి పారిపోతున్న దుండగుడిని గ్రామస్తులు పోలీసులకు పట్టించిన ఘటన ఆదివారం కందుకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేగంపేటలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని గుమ్మడవెళ్లికి చెందిన వానరాసి జంగమ్మ, ఆమె భర్త వీరస్వామి, కుమారుడు జగదీశ్వర్‌లు గుమ్మడవెళ్లి-బేగంపేట గ్రామాల మధ్య మేకలను మేపుకుంటున్నారు.

మెడలోంచి మంగళసూత్రం అపహరణ

దుండగుడిని పట్టుకొని పోలీసులకు పట్టించిన గ్రామస్తులు

కందుకూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఒంటరిగా ఉన్న మహిళ మెడలోంచి మంగళసూత్రం(రోల్డ్‌గోల్డ్‌) అపహరించి పారిపోతున్న దుండగుడిని గ్రామస్తులు పోలీసులకు పట్టించిన ఘటన ఆదివారం కందుకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేగంపేటలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని గుమ్మడవెళ్లికి చెందిన వానరాసి జంగమ్మ, ఆమె భర్త వీరస్వామి, కుమారుడు జగదీశ్వర్‌లు గుమ్మడవెళ్లి-బేగంపేట గ్రామాల మధ్య మేకలను మేపుకుంటున్నారు. వీరస్వామి మేకలకు నీరు తాగించడానికి మామిడి తోటలోని బోర్‌బావి వద్దకు తీసుకెళ్లాడు. జగదీశ్వర్‌ పనిపై బైక్‌పై బేగంపేటకు వెళ్లాడు. జంగమ్మ రోడ్డుపై ఒంటరిగా ఉండడం గమనించిన దుండగుడు ఆమె మెడలో ఉన్న 22 గ్రాముల రోల్డ్‌ గోల్డ్‌ మంగళసూత్రం అపహరించి పారిపోయాడు. ఇంతలో వీరస్వామిని పలిచి జంగమ్మ ఏడుస్తూ విషయం చెప్పింది. వెంటనే వారు జగదీశ్వర్‌కు కాల్‌ చేసి చెప్పారు. అయితే, ఆ దుండగుడు బేగంపేటలో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

Updated Date - Nov 25 , 2024 | 12:08 AM