గ్రామాభిృద్ధికి నిధులు కేటాయించండి
ABN , Publish Date - Nov 19 , 2024 | 11:11 PM
మండల పరిధిలోని పోమాల్పల్లి అభివృద్ధికి నిధులు కేటాయించాలని మండల బీజేపీ సభ్యత్వ నమోదు కోకన్వీనర్ కుమ్మరి మహేశ్ కోరారు. మంగళవారం ఎంపీ అరుణను హైదరాబాద్లోని ఆమె నివాసంలో కలిసి గ్రామం లో నెలకొన్న సమస్యలు వివరించారు.
కేశంపేట, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పోమాల్పల్లి అభివృద్ధికి నిధులు కేటాయించాలని మండల బీజేపీ సభ్యత్వ నమోదు కోకన్వీనర్ కుమ్మరి మహేశ్ కోరారు. మంగళవారం ఎంపీ అరుణను హైదరాబాద్లోని ఆమె నివాసంలో కలిసి గ్రామం లో నెలకొన్న సమస్యలు వివరించారు. పాఠశాల భవనం పనులు మధ్యలో ఆగిపోయాయని, ఎంపీ నిధులు కేటాయించాలని కోరారు. ఇందుకు ఎంపీ అరుణ సానుకూలంగా స్పం దించారని మహేష్ తెలిపారు.