కలెక్టర్ ఆధ్వర్యంలోనే స్టాఫ్‌నర్స్‌ల నియామకం
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:15 AM
మేడ్చల్, మాల్కాజ్‌గిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధ్వర్యంలో స్టాఫ్‌నర్స్ నియామకాలు కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రఘునాథ్‌స్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కీసర, నవంబరు13,(ఆంఽధ్రజ్యోతి): మేడ్చల్, మాల్కాజ్‌గిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధ్వర్యంలో స్టాఫ్‌నర్స్ నియామకాలు కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రఘునాథ్‌స్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కొంత మంది అభ్యర్థులకు 9836330846 నంబర్ నుండి ఫోన్ చేసి మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా చెప్పుకొని, అభ్యర్థులు ఎంపిక అయినట్లు, 7003386564 ఫోన్ నంబర్‌కి ఫోన్‌పే గానీ, గూగుల్ పేగాని చేయాలని ఫోన్లు వస్తున్నట్లు తమకు తెలిసిందని ఆయన తెలిపారు. కావున అభ్యర్థులు ఇలాంటి ఫోన్‌కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. స్టాఫ్‌నర్సు నియామాకక ప్రక్రియ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని, ఎవరైనా డబ్బులివ్వాలని ఫోన్ చేస్తే అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేయాలని ఆయన తెలిపారు. అదే విధంగా అనూమానాస్పద ఫోన్‌కాల్స్‌పై శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశామని రఘునాథ్‌స్వామి తెలిపారు.