Share News

అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:59 PM

పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని సీజ్‌ చేసినట్లు ఘట్‌కేసర్‌ సీఐ పరశురాం తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత
కబేళాలకు తరలిస్తుండగా పట్టుబడిన పశువులు

  • వాహనంలో 39 ఆవులు, 34 ఎడ్లు

  • మార్గమధ్యలో 4 ఆవులు ఒక ఎద్దు మృత్యువాత

ఘట్‌కేసర్‌ రూరల్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని సీజ్‌ చేసినట్లు ఘట్‌కేసర్‌ సీఐ పరశురాం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. యంనంపేట్‌ చౌరస్తా వద్ద గురువారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా వరంగల్‌ వైపు నుంచి హైదారాబాద్‌ వైపు వెళుతున్న టీఎస్‌ 07 యుఎం5419 వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు. వాహనంలో 73పశువులను తాళ్లతో కట్టి నీళ్లు, మేత లేకుండా దీనస్థితిలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, దాచ్‌పల్లికి చెందిన డ్రైవర్‌ ప్రమోద్‌(32)ను విచారించగా రాజేంద్రనగర్‌కు చెందిన యజమాని షానవాజ్‌ విజయవాడ హనుమాన్‌ జంక్షన్‌ నుంచి బహదూర్‌పూర కబేళాలకు తరలిస్తున్నట్లు తెలిపాడు. 73 పశువుల్లో 39ఆవులు, 34 ఎడ్లు ఉన్నాయి. రవాణా సమయంలో వెలుతురు, గాలి, నీరు లేక నాలుగు ఆవులు, ఒక ఎద్దు మృత్యువాతపడ్డాయి. విషయం తెలుసుకున్న గౌరక్షదల్‌, బజరంగదళ్‌ అక్కడికి ఆవులను కబేళాలకు తరలిస్తున్న నిందితులను శిక్షించాలని కోరారు. ఆవులను జియాగూడలోని కామధేను గోశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Nov 14 , 2024 | 11:59 PM