అక్రమంగా తరలిస్తున్న ఆవులు పట్టివేత
ABN , Publish Date - Jul 15 , 2024 | 12:15 AM
నల్గొండ జిల్లా మల్లేపల్లి సంత నుంచి మహేశ్వరం మండలంలోని తుక్కుగూడకు అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకొని గోశాలకు తరలించారు.
యాచారం, జూలై 14 : నల్గొండ జిల్లా మల్లేపల్లి సంత నుంచి మహేశ్వరం మండలంలోని తుక్కుగూడకు అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకొని గోశాలకు తరలించారు. ఆదివారం సా యంత్రం యాచారం పోలీసులు మాల్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో(టీఎ్‌స05జెడీ 1506) వాహనంలో తాళ్లతో కట్టేసి ఆరు కోడెలు, మూడు ఆవులను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో వాటిని పోలీ్‌సస్టేషన్‌కు.. తర్వాత నగర శివారులోని గోశాలకు తరలించారు. డ్రైవర్ శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపాల్ తెలిపారు.