Share News

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:05 AM

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని బుధవారం మండల కేంద్రంలోని కొత్తగూడలో పట్టుకున్నారు. అధికారి విజయ్‌ కథనం మేరకు..

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

28క్వింటాళ్లు స్వాధీనం.. వాహనం సీజ్‌

కందుకూరు, అక్టోబరు 9: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని బుధవారం మండల కేంద్రంలోని కొత్తగూడలో పట్టుకున్నారు. అధికారి విజయ్‌ కథనం మేరకు.. కడ్తాల మండలం ముద్విన్‌ నుంచి మహేశ్వరం మండలం కోళ్లపడకల్‌కు తరలిస్తున్న 28 క్వింటాళ్ల బియ్యాన్ని సిబ్బందితో కలిసి కొత్తగూడ వెళ్లే రోడ్డుపై పట్టుకున్నారు. డ్రైవర్‌ను విచారించగా వివరాలు వెల్లడించినట్లు సీఐ సీతారాం తెలిపారు. ఎస్వోటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Oct 10 , 2024 | 07:25 AM