Share News

బావిలో దూకి ఆశావర్కర్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:51 PM

ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఆశావర్కర్‌ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నవాబుపేట మండలంలో జరిగింది.

బావిలో దూకి ఆశావర్కర్‌ ఆత్మహత్య

నవాబుపేట, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఆశావర్కర్‌ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నవాబుపేట మండలంలో జరిగింది. గ్రామస్థులు, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చిట్టిగిద్ద గ్రామానికి చెందిన అనిత(48) గ్రామంలో గత 13సంవత్సరాలుగా ఆశావర్కర్‌గా విధులు నిర్వహిస్తోంది. తన కూతురు స్వాతికి వివాహం చేసిన అనంతరం రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందడంతో తల్లి దగ్గర ఉంటోంది. భర్త మృతి చెందడంతో కూతురు స్వాతికి తిరిగి వివాహం చేయలేక ఆదివారం అర్ధరాత్రి కూతురికి న్యాయం చేయలేకపోతున్నాని ఫోన్‌ ద్వారా మెసేజ్‌ పంపించి గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన తల్లికి ఫోన్‌ చేసిన స్వాతి తెలిసిన వారు, బంధువుల దగ్గర ఆచూకీ కోసం వెతికింది. మెసేజ్‌ ఆధారంగా గ్రామ శివారులోని బావి దగ్గరికి వెళ్లి చూడగా బావిలో ఆమె మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా ఆశా వర్కర్‌ అనిత మృతికి భర్త శ్యామ్‌ కారణమై ఉంటాడని గ్రామంలో గుసగుసలు వినిపించాయి.

Updated Date - Dec 23 , 2024 | 11:51 PM