అధికారులపై దాడి అమానుషం
ABN , Publish Date - Nov 14 , 2024 | 11:29 PM
అధికారులపై దాడి అమానుషమని కలెక్టరేట్ ఏవో సునీల్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో అధికారులపై జరిగిన దాడిని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు.
కలెక్టరేట్ ఏవో సునీల్
కార్యాలయం ఎదుట ఉద్యోగుల ధర్నా
రంగారెడ్డి అర్బన్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : అధికారులపై దాడి అమానుషమని కలెక్టరేట్ ఏవో సునీల్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో అధికారులపై జరిగిన దాడిని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, తదితరులపై జరిగిన దాడిని వారు ఖండించారు. రెవెన్యూ సిబ్బందిపై దాడులు ప్రభుత్వం అరికట్టాలని కోరారు. అధికారులపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. ఈ ధర్నాలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేటెడ్ ప్రెసిడెంట్ వెంకటేశం, నాయకులు రామారావు, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు.