సైబర్ నేరాలపై అవగాహన
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:27 AM
బాల్య వివాహాలు, సైబర్ నేరాల పట్ల కళాజాత బృందాలతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు.
దౌల్తాబాద్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు, సైబర్ నేరాల పట్ల కళాజాత బృందాలతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శనివారం తనిఖీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. దౌల్తాబాద్ మండలంలో ప్రస్తుతం నేరాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, మూఢ నమ్మకాలు, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై గ్రామాల్లో కళాజాత బృందాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, దౌల్తాబాద్ ఎస్సై రవిగౌడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.