కిషన్‌నగర్‌లో బెల్ట్ షాపులను నిషేధించాలి
ABN , Publish Date - Oct 10 , 2024 | 12:03 AM
ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్‌లో బెల్ట్ షాపులను నిషేధించాలని గ్రామస్తులు బుధవారం శంషాబాద్ డీసీపీని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
షాద్‌నగర్ రూరల్, అక్టోబరు 9: ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్‌లో బెల్ట్ షాపులను నిషేధించాలని గ్రామస్తులు బుధవారం శంషాబాద్ డీసీపీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. గ్రామంలో నిత్యం తెల్లవారు జామున 4గంటల నుంచి బెల్ట్‌షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, మద్యానికి యువకులు బానిసలై జీవితాలు పాడు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందన్నారు. కూలీలు అర్ధరాత్రి వరకూ బెల్ట్‌షాపుల వద్దనే ఉంటున్నారని పేర్కొన్నారు. గ్రామంలో మద్యం అమ్మకాలు జరగకుండా చూడాలని డీసీపీని కోరారు.