Share News

పేదలకు మెరుగైన వైద్యసేవలందించాలి

ABN , Publish Date - Nov 19 , 2024 | 10:48 PM

అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.

పేదలకు మెరుగైన వైద్యసేవలందించాలి
పారిశుధ్య కార్మికురాలిని సన్మానిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

-డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలి

-కలెక్టర్‌ నారాయణరెడ్డి

మహేశ్వరం, నవంబరు 19 ( ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించి 24 గంటలు వైద్య సేవలు అందించేలా అందుబాటులో ఉండాలన్నారు. విధులకు సక్రమంగా హాజరుకాని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతే కాకుండా రోగులకు అవసరమయ్యే వైద్య పరికరాలు ఉన్నాయా అంటూ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేశ్వరం ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల లోని డిజిటల్‌ టీవీని విద్యార్థులతో ఓపెన్‌ చేయించారు. పదో తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన వారికి రూ. 10 వేలు ప్రోత్సాహకంగా ఇస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన ఆయన మండల అభివృద్ధి అధికారి శైలజారెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్దేశించినన సమయం వరకు సర్వేను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పారిశుధ్య పరిస్థితులను మెరుగుపర్చాలి

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 19 : (ఆంధ్రజ్యోతి) : ప్రతీ గ్రామంలో తాగునీరు, పారిశుధ్య పరిస్థితులను మెరుగుపర్చాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. వరల్డ్‌ టాయిలెట్‌ డే సందర్బంగా మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ మిషన్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెలా 10వ తేదీ వరకు ప్రతీ గ్రామంలో చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో అవసరమున్న చోట మరుగుదొడ్లను మంజూరుకు ప్రతిపాదనలు ఇవ్వాలని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. వరల్డ్‌ టాయిటెట్‌ డే సందర్భంగా ఐదుగురు పారిశుధ్య కార్మికులు కవిత, జ్యోతి, అండాలు, చెన్నయ్య, యాదయ్యలను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, డీఆర్‌డీఏ పీడి శ్రీలత, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేష్‌మోహన్‌, మిషన్‌ భగీరథ ఈఈ రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 10:49 PM