బైపాస్ రోడ్డు సర్వేను పూర్తి చేయాలి
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:41 PM
బైపాస్ రోడ్డు సర్వేను త్వరగా పూర్తి చేయాలని, ప్రజా అవసరాల కోసం రైతులు నుంచి భూములు తీసుకుంటున్నామని, వారికి పరిహారం ఇచ్చేందుకు సర్వే పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశం
తాండూరు రూరల్, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): బైపాస్ రోడ్డు సర్వేను త్వరగా పూర్తి చేయాలని, ప్రజా అవసరాల కోసం రైతులు నుంచి భూములు తీసుకుంటున్నామని, వారికి పరిహారం ఇచ్చేందుకు సర్వే పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం తాండూరు మండలం చెంగోల్ గ్రామ శివారులోని బైపాస్ రోడ్డు కోసం తీసుకున్న రైతుల భూములను పరిశీలించారు. కాగా, ఇంకా 17 మంది రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉండగా, త్వరలో సర్వే నిర్వహించి అందించేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ తారాసింగ్‌ను ఆదేశించారు. రైతులు కూడా రెవెన్యూ అధికారులకు సహకరించాలని కోరారు. సర్వే నివేదిక రాగానే ప్రభుత్వం ద్వారా రైతులకు పరిహారం అందజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 17మంది రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉన్నందున.. వారి నుంచి ఎన్ని ఎకరాలు తీసుకున్నారనే విషయమై సమగ్రంగా సర్వే చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ గోపి, సర్వేయర్ మహేష్ రైతులు పాల్గొన్నారు.